ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది

– ఐక్యరాజ్య సమితి పసనితీరు అందుకు తగ్గట్లుగా లేదు
– భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌

‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 24 :‌ ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ .జైశంకర్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేవని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో యూఎన్‌లో అంతా సరిగా లేదన్నారు. ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చారు. ఇది అత్యవసరమైనప్పటికీ యూఎన్‌లో మార్పులు జరిగేలా ఆ సంస్కరణలు ఉండాలన్నారు. ఐరాసకు భారత్‌ ఎప్పు‌డూ బలమైన మద్దతుదారుగానే ఉంటుందని, అలాగే కొనసాగుతుందని తెలిపారు. కానీ యూఎన్‌ ‌నిర్ణయాలు దాని సభ్యత్వాన్ని, ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించవని వ్యాఖ్యానించారు. ఐరాస  80వ వార్షికోత్సవం నేపథ్యంలో పోస్టల్‌ ‌స్టాంపు విడుదల చేసిన సందర్భంగా జైశంకర్‌ మాట్లాడారు. వివాదాల యుగంలో శాంతి అనేది అవసరమని ‌పేర్కొన్నారు. ఇటీవల మైనారిటీల రక్షణకు, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులు కాపాడేందుకు భారత్‌ ‌సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలంటూ ఐరాస మానవ హక్కుల కమిషన్‌ ‌ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్న స్విట్జర్లాండ్‌ ‌వ్యాఖ్యానించింది. దీనికి భారత్‌ ‌దీటుగా బదులిచ్చింది. ఆ దేశం జాత్యహంకారం, క్రమబద్ధమైన వివక్ష, విదేశీయులపై విద్వేషం వంటి అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ముందు వాటిని పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించింది. మరోవైపు పహల్గాంలో పౌరులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచవ్యాప్తంగా ఖండించినప్పటికీ పాకిస్థాన్‌ ‌తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. యూఎన్‌ ‌సమావేశాల్లో పదేపదే కశ్మీర్‌ అం‌శాన్ని ప్రస్తావించడంతోపాటు భారత్‌పై నిందలు మోపే ప్రయత్నాలు చేస్తున్నది. అయితే భారత్‌ ‌వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో జై శంకర్‌ ‌తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక, గురువారం యూఎన్‌లో జరిగిన సమావేశాల్లో పాక్‌ ‌దౌత్యవేత్తలు ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే భారత్‌ ‌వీటిని తీవ్రంగా వ్యతిరేకించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *