ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి సేవలందించాలి

– ప్రముఖ కోచ్‌ రిచర్డ్‌ను కోరిన మంత్రి శ్రీహరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని పముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ రిచర్డ్‌ అలెన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ అభివృద్ధి కోసం పలు హోదాల్లో రిచర్డ్‌ అలెన్‌ పని చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి రిచర్డ్‌ అలెన్‌ను శాలువాతో సత్కరించారు. తెలంగాణలో ఫుట్‌బాల్‌ క్రీడ అభివృద్ధిపై ఇరువురూ పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి తన విలువైన సేవలు అందజేయాలని రిచెడ్‌ ఆలెన్‌ను మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, స్పోర్ట్షు అథారిటీ ఆఫ్ తెలంగాణ‌ వీసీ, ఎండీ సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *