కార్ల సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

– దగ్ధమైన కార్లు.. పెద్ద ఎత్తున నష్టం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ కార్ల కంపెనీ సర్వీస్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు దగ్ధమయ్యాయి. రాజేంద్రనగర్ మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ అగ్ని ప్రమాదం కారణంగా పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *