డిసెంబర్ 6 కల్లా తుది ప్రతి సిద్దం కావాలి 

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులకు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు 
 తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ , తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పలు సూచనలు .. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. సోమవారం , మంగళ వారం   రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి ఆంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అని సూచిస్తూ డిసెంబర్ 2 వ తేదీ రాత్రి కి నివేదిక సమర్పించాలి..3, 4  తేదీలలో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎస్ ,  సిఎంవో అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులను చేసి.. తుది ప్రతి సిద్ధం చేయాలి.6 వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణం గా సిద్ధం కావాలి అని ఆదేశాలు జారీ చేసారు. అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలి.   , సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి ఆంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు  ఈ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రుల సమావేశం లో ఐఎస్ బీ ప్రొఫెసర్లు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *