వ్య‌వ‌సాయ‌ శాఖ కార్యాల‌యాల్లో ఫేషియల్ రికగ్నిషన్

– స‌కాలంలో ఉద్యోగులు విధుల‌కు హాజ‌ర‌య్యేలా చ‌ర్య‌లు
– ఆలస్యంగా వచ్చే వారిపై చ‌ర్య‌లు
– మంత్రి తుమ్మ‌ల ఆదేశాల మేర‌కు మార్పులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18: వ్యవసాయ, అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో డివిజన్ లెవెల్ ఉద్యోగుల వరకు హాజరుపై నిర్లక్ష్యం తావులేకుండా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల పలు హెచ్ ఓ డీ కార్యాలయాలు మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు చేయగా ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్న విషయం గుర్తించగా విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్ ను మంత్రి తుమ్మల ఆదేశించారు. వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై నిర్లక్ష్యం లేకుండా ఉండేలా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని హెచ్ ఓ డీ లకు కార్యదర్శి సురేందర్ మోహన్ ఆదేశాలు జారీ చేశారు.విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగుల పట్ల తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టు లు అందించాల్సిందిగా సురేందర్ మోహన్ సూచించారు. ప్రజా పాలనలో రైతాంగం సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొందరు ఉద్యోగులు వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఉద్యోగులు విధుల విషయంలో ఎంతో జవాబుదారిగా ఉండాలని మంత్రి తుమ్మల ఉద్యోగులకు సూచించారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్ ఐటీ శాఖ వారితో మాట్లాడి డాష్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై ఆన్ లైన్ లో సమాచారం ఉండే విధంగా డాష్ బోర్డు పనిచేయాలని ఐటీ డిపార్ట్ మెంట్ వారికి పనులు అప్పగించారు.కొద్ది రోజుల్లో వ్యవసాయ- అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్ వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *