రేవంత్ రెడ్డి ఇటీవలి చేతలకు, మాటలకు నిజానికి ఆయన మీద కోపం రావాలి. కానీ, జాలి కలుగుతోంది. కెసిఆర్ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతలో తన భవిష్యత్తును గుర్తించి, అందుకు అనుగుణంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించగలిగిన నాయకుడు, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న పరిపాలనలో మాత్రం దయనీయంగా విఫలమవుతున్నారు. పదహారునెలలకే తన మీద విముఖత పెరిగి పోతుంటే, ఏమి చేయాలో పాలుపోక, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కంచె గచ్చీబౌలీ భూముల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరించిన వైఖరి, మాట్లాడిన మాటలు, రాజకీ యంగా కానీ, పాలనాపరంగా కానీ అన్యాయమైనవి, దారుణమైనవి. చివరకు భంగపాటు ఎదురవుతుందని తెలిసి పోతున్నా, ఆత్మహ త్యాసదృశమైన మొం డితనాన్ని ఆయన వదలలేదు. సుప్రీం కోర్టు మధ్యంతరంగా ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తి, మొత్తంగా వాతావరణంలో కనిపిస్తున్న మనోభావాల ధోరణి గ్రహించి ఉంటే, ఇంత జరిగాక కూడా, మొత్తంగా సెంట్రల్ యూని వర్సిటీనే ఫోర్త్ సిటీకి తరలించే ఆలోచనను, ఎకోపార్క్ ప్రతిపాదనను ఆశ్రయించి ఉండరు!
సమాజం ఎట్లా ఆలో చిస్తుందో, ఏ విషయాలకు నొచ్చు కుంటు ందో, వేటికి తీవ్రంగా స్పం దిస్తుందో, ప్రతిఘటిస్తుందో, ఎటువంటి అంశాల్లో జనాన్ని చిరాకు పెట్టగూడదో నాయ కులకు తెలియాలి. అధి కారసౌధాల్లోకి చేరిన తరువాత, ప్రజలు పిపీలికాల్లా కనిపించడమే కాదు, వారి యిష్టాయిష్టాల మీద కూడా అలక్ష్యభావం ఏర్పడుతుంది. పెరిగిన దూరం పరాయిభావన తెస్తుంది. అందలాలెక్కించిన జనంలోనే అసహనం మొదలవుతుంది. మహా మహా నాయకులకే ఈ సత్యం బోధపడక, ప్రజలమద్దతును, అధికారాన్ని కోల్పోయారు. రాజకీయ జీవితం, అధికార అనుభవం తక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి తడబడడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, పదేళ్లు పాలిస్తానని, కొత్తదనం చూపిస్తానని చెప్పుకుంటూ వస్తున్న నాయకుడికి ఈ వైఫల్యాలు అవాంఛనీయమైనవి. ముఖ్యంగా, బలమైన ప్రతిపక్షం, కాచుకుకూర్చున్న జాతీయపక్షం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు, ఈ తప్పులు చాలా చాలా ఖరీదైనవి.
తెలంగాణ రాజకీయ సమాజంలోని సమీకరణలు, వ్యూహాలు, చాకచక్యాలూ అన్నీ ఆయనకు తెలిసి ఉండవచ్చును కానీ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక సున్నితత్వాలు, స్పందనలు ఆయనకు తెలియవనిపిస్తుంది. అన్నిటికి మించి గత పాతికేళ్లలో తెలంగాణ సంతరించుకున్న నూతన చైతన్యం, విచక్షణ ఆయన గమనంలో లేవు. ? బిఆర్‌ఎస్ తరచు గుర్తు చేస్తున్నందువల్లనే కాదు, ఆయన ధోరణి వల్ల కూడా తెలంగాణ సమాజంలోని కొన్ని శ్రేణులు, రేవంత్ రెడ్డి తెలుగుదేశం గతానుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర చిహ్నాల మీద ఆయన చూపిన అసహనం, ఆ అవగాహనారాహిత్యం వల్లనే. జై తెలంగాణ నినాదాన్నిఆయన ఇవ్వకపోవడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేపథ్యం కారణంగా, ఆయనకు తెలంగాణ ఉద్యమంతో పరిచయం తక్కువగానే ఉండింది. తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతలను, ఉద్యమచిహ్నాలను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజంతో తాను మరింత దగ్గర కావచ్చునని రేవంత్ కు చెప్పేవారే లేరు. ఆయన చుట్టూ ఉన్న సలహాదారులలో తెలంగాణ ఉద్యమం కలిగించిన ఇంగితం ఉన్నవారు అసలున్నారా అన్న సందేహం కలుగుతుంది.
కెసిఆర్ ప్రభుత్వం చేసిన తప్పుల మీద ఆధారపడి, రేవంత్ ఇక తన ఉనికిని కాపాడుకోలేరు. గతాన్ని మరిపించేంతగా రేవంత్ కొత్త తప్పులు శరవేగంగా చేసుకుంటూ పోతున్నారు! నిలిచి సమీక్షించుకునే వ్యవధి కూడా తనకు తాను ఇచ్చుకోకుండా, ఆయన ఒకే రకం నిర్ణయాలను తీసుకుంటూ పోతున్నారు. ఎవరైనా ఆయనకు పరిస్థితులను, వాస్తవికతను బోధపరచకపోతే, జటిలమైన రోజులను ఎదుర్కొనవలసి వస్తుంది.
బిఆర్‌ఎస్ ను, దాని నాయకులను అదేపనిగా దూషించడం ద్వారా, ప్రతిపక్షానికి సవాళ్లు విసరడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు రాజకీయ చర్చలోకి రాకుండా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆయన స్థానంలో ఎవరైనా అదే పని చేస్తూ ఉండవచ్చు, కానీ, ప్రజలు దాన్నిఎక్కువ కాలం సహిస్తూ ఉండరు.
అనేక చిన్న చిన్న ఉపబృందాల కాంగ్రెస్, ఆర్థిక అవసరాలున్న, బలహీన అధిష్ఠానం, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చనివ్వని ఖజానా, రాష్ట్రం ఎంత కటకటగా ఉన్నా, తమ ఇల్లు చక్కబెట్టుకోవడానికి ప్రయ త్నించే ఒత్తిడినేతలు, ఇప్పటికీ ఓటమిని మాన సికంగా అంగీకరించక, అధికారపక్షంతో ఢీకొంటున్న బిఆర్‌ఎస్.. వీటన్నిటి మధ్య స్వామికార్యాలూ స్వకార్యాలూ చూసు కుంటూ పరిపాలన మీద తన ముద్ర కూడా వేయాలనుకునే నాయకుడి పరిస్థితి ఏమంత సుఖంగా ఉండదు. నిజమే. కానీ, ప్రజల వైపు నుంచి చూస్తే, సహనానికి కొన్ని హద్దులు ఉంటాయి. సంక్షేమం చేయకపోగా, అభివృద్ధి పేరిట సమాజాన్ని బాధించే చర్యలు తీసుకుంటున్నప్పుడు, జనం ఓపిక అడుగంటిపోతుంది. లగచర్ల సంఘటన కానీ, హైదరాబాద్‌లో హైడ్రా పేరిట సృష్టించిన బీభత్సం కానీ, తాజాగా హైదరాబాద్ కేంద్రీయవిశ్వవిద్యాలయం భూముల వేలానికి చేసిన ప్రయత్నం కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాయి. ఏడాదిన్నర కూడా కాకముందే కొత్త ప్రభుత్వం రేటింగ్ దారుణంగా పడిపోయింది.
రేవంత్ రెడ్డికి, బిఆర్‌ఎస్ అగ్రనాయకులకు మధ్య ఉన్న వైరం, రాజకీయం కాదు,వ్యక్తిగతమేమో అన్నంత తీవ్రంగా కనిపిస్తుంది. ఉభయపక్షాల వాద ప్రతివాదాలు కరకుగా ఉంటాయి, కక్షను ధ్వనిస్తాయి. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన ను అనుక్షణం గుర్తుచేస్తూ, వర్తమానం నుంచి దృష్టి మళ్లించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉంటారు. రేవంత్ పాలనలో జరుగుతున్న అణచివేతలు, అక్రమాల మీద బిగ్గరగా గొంతెత్తి బిఆర్‌ఎస్ హడావుడి చేస్తుంటుంది. రేవంత్ దుష్పరిపాలన ముందు కెసిఆర్ ది స్వర్ణయుగమని ప్రజలు గుర్తించి పశ్చాత్తాపం ప్రకటించాలన్నట్టు బిఆర్‌ఎస్ ధోరణి కాగా, గత ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూనే, తానూ అటువంటి పద్ధతులను అనుసరించడం రేవంత్ ప్రత్యేకత.
బిఆర్‌ఎస్ కొన్ని విషయాలలో ప్రదర్శించే ప్రభుత్వ వ్యతిరేకత, జనంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లగచర్లలో స్థానిక బాధితులు సుదీర్ఘకాలంగా చేస్తూ వచ్చిన ఆందోళనను, తన వైపు మళ్లించుకోవడానికి బిఆర్‌ఎస్ చేసిన ప్రయత్నాన్ని ఉద్యమకారులు మెచ్చలేదు. తమ న్యాయమైన ఉద్యమానికి ఒక రాజకీయపార్టీ రంగు అనవసరమని, హానికరమని వారు అనుకున్నారు. బిఆర్‌ఎస్ కూడా ఆ విషయం గుర్తించి గుణపాఠం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తాను ప్రముఖంగా కనిపించకుండా జాగ్రత్తపడడం అటువంటి దిద్దుబాటు వల్లనే. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం లగచర్ల నుంచి తాను తీసుకోవలసిన గుణపాఠం తీసుకోలేదు. సెంట్రల్‌యూనివర్సిటీ విషయంలో భంగపాటును ఎదుర్కొన్నారు.
ఉదాహరణకు- లగచర్ల. అక్కడ తాను తలపెట్టినదాన్ని వ్యతిరేకించే నైతిక అర్హత బిఆర్‌ఎస్ కు లేదన్నది ప్రభుత్వ వాదన. నిజంగానే, బిఆర్‌ఎస్ కొన్ని విషయాలలో ప్రదర్శించే ప్రభుత్వ వ్యతిరేకత, జనంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లగచర్లలో స్థానిక బాధితులు సుదీర్ఘకాలంగా చేస్తూ వచ్చిన ఆందోళనను, తన వైపు మళ్లించుకోవడానికి బిఆర్‌ఎస్ చేసిన ప్రయత్నాన్ని ఉద్యమకారులు మెచ్చలేదు. తమ న్యాయమైన ఉద్యమానికి ఒక రాజకీయపార్టీ రంగు అనవసరమని, హానికరమని వారు అనుకున్నారు. బిఆర్‌ఎస్ కూడా ఆ విషయం గుర్తించి గుణపాఠం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తాను ప్రముఖంగా కనిపించకుండా జాగ్రత్తపడడం అటువంటి దిద్దుబాటు వల్లనే. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం లగచర్ల నుంచి తాను తీసుకోవలసిన గుణపాఠం తీసుకోలేదు. సెంట్రల్‌యూనివర్సిటీ విషయంలో భంగపాటును ఎదుర్కొన్నారు. రెండుచోట్లా విస్తృత జనాభిప్రాయం ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండడానికి కారణమేమిటో, ఉద్యమకారుల వెంట సమాజం ఎందుకు ఉండిందో గుర్తించి ఉంటే , రేవంత్ రెడ్డి 40 వేలకోట్ల ఆదాయానికి వేరే మార్గాలను ఆలోచించేవారు.
రాంగ్ సైడ్ రబ్ చేయడం- అని ఇంగ్లీషులో ఒక వ్యక్తీకరణ ఉంది. పుండు మీద కారం చల్లడం అన్న తెలుగు జాతీయానికి కొంచెం దగ్గరగా ఉంటుందది. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలోని కొన్ని పరిమితుల వల్ల ఆయనకు ఈ రబ్ చేయడం, కారంచల్లడం వంటి పనుల్లో ఉండే ప్రమాదం పెద్దగా తెలియదనుకోవాలి. తెలంగాణ రాజకీయ సమాజంలోని సమీకరణలు, వ్యూహాలు, చాకచక్యాలూ అన్నీ ఆయనకు తెలిసి ఉండవచ్చును కానీ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక సున్నితత్వాలు, స్పందనలు ఆయనకు తెలియవనిపిస్తుంది. అన్నిటికి మించి గత పాతికేళ్లలో తెలంగాణ సంతరించుకున్న నూతన చైతన్యం, విచక్షణ ఆయన గమనంలో లేవు. ? బిఆర్‌ఎస్ తరచు గుర్తు చేస్తున్నందువల్లనే కాదు, ఆయన ధోరణి వల్ల కూడా తెలంగాణ సమాజంలోని కొన్ని శ్రేణులు, రేవంత్ రెడ్డి తెలుగుదేశం గతానుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర చిహ్నాల మీద ఆయన చూపిన అసహనం, ఆ అవగాహనారాహిత్యం వల్లనే. జై తెలంగాణ నినాదాన్నిఆయన ఇవ్వకపోవడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేపథ్యం కారణంగా, ఆయనకు తెలంగాణ ఉద్యమంతో పరిచయం తక్కువగానే ఉండింది. తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతలను, ఉద్యమచిహ్నాలను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజంతో తాను మరింత దగ్గర కావచ్చునని రేవంత్ కు చెప్పేవారే లేరు. ఆయన చుట్టూ ఉన్న సలహాదారులలో తెలంగాణ ఉద్యమం కలిగించిన ఇంగితం ఉన్నవారు అసలున్నారా అన్న సందేహం కలుగుతుంది., తన ఇమేజిని మరమ్మత్తు చేసుకోవలసిన అవసరం రేవంత్ రెడ్డికి చాలా ఉన్నది.
లగచర్లలో ఒక రకమైన సెగ, దామగుండంలో మరొకరకమైన నిరసన చూసిన తరువాత, సెంట్రల్ యూనివర్సిటీలో ఎటువంటి స్పందన వస్తుందో ఊహిం చగలగాలి. కెసిఆర్ లాగానే యూనివర్సిటీలన్నిటితో వైరం పెట్టుకుంటే, ఇక ప్రభావశీల వర్గాలలో ప్రభుత్వానికి సమర్థన ఎక్కడ? విద్యార్థుల మీద విరుచుకుపడుతూ ఉంటే, ఇక ఉద్యమాలకు విరామం ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉన్నందుకు కొందరు మేధావులు ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంటే, ప్రభుత్వ వైఫల్యాల తీవ్రత మేధావుల బౌద్ధిక సమర్థనల శక్తిని కూడా ఆవిరి చేస్తోందన్నమాట! ఆర్థికంగా అనువైన పరిస్థితి లేకపోవడం ఒక ప్రతికూలతే. కానీ, ఆ పరిస్థితికి ప్రజలు కారణం కాదు కదా! వోటర్లకు ప్రత్యక్ష లబ్ధి మాత్రమే చేకూర్చడం అనే వేలంవెర్రికి కారణం, రాజకీయపక్షాల భావదారిద్య్రమే.
సమాజం ఎట్లా ఆలోచిస్తుందో, ఏ విషయాలకు నొచ్చుకుంటుందో, వేటికి తీవ్రంగా స్పందిస్తుందో, ప్రతిఘటిస్తుందో, ఎటువంటి అంశాల్లో జనాన్ని చిరాకు పెట్టగూడదో నాయకులకు తెలియాలి. అధికారసౌధాల్లోకి చేరిన తరువాత, ప్రజలు పిపీలికాల్లా కనిపించడమే కాదు, వారి యిష్టాయిష్టాల మీద కూడా అలక్ష్యభావం ఏర్పడుతుంది. పెరిగిన దూరం పరాయిభావన తెస్తుంది. అందలాలెక్కించిన జనంలోనే అసహనం మొదలవుతుంది. మహా మహా నాయకులకే ఈ సత్యం బోధపడక, ప్రజలమద్దతును, అధికారాన్ని కోల్పోయారు. రాజకీయ జీవితం, అధికార అనుభవం తక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి తడబడడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, పదేళ్లు పాలిస్తానని, కొత్తదనం చూపిస్తానని చెప్పుకుంటూ వస్తున్న నాయకుడికి ఈ వైఫల్యాలు అవాంఛనీయమైనవి. ముఖ్యంగా, బలమైన ప్రతిపక్షం, కాచుకుకూర్చున్న జాతీయపక్షం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు, ఈ తప్పులు చాలా చాలా ఖరీదైనవి.
అర్థవంతమైన అభివృద్ధి లేనిచోట సంక్షేమం అవసరమే. కానీ, దీర్ఘకా లికమైన, మౌలికమయిన జీవనాభివృద్ధి సంగతేమిటి? ఈ చిక్కుముడిని విప్పడానికి సృజనాత్మకత కావాలి. అభివృద్ధి పేరిట ప్రజలను బాధించకుండా ఆర్థికవనరులను పెంచుకోవడం ఎట్లాగో ఆలోచించాలి. తగిన నిపుణుల నుంచి, ప్రజాపక్షపాత బుద్ధిజీవుల నుంచి సలహాలు తీసుకుని పరిశీలించాలి. అన్నిటికి మించి ప్రభుత్వానికి ఉత్తమ సంకల్పాలు ఉన్నాయన్న విశ్వాసాన్ని ప్రజలలో కలిగించాలి.
తెలంగాణ పౌరసమాజంలోని ఒక బలమైన శ్రేణి కల్పించిన వాతావరణం ఆసరాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో ప్రజాస్వామిక ఆకాంక్షలు బలమైనవని తెలుసుకుని, ఏడో వాగ్దానం కూడా రేవంత్ రెడ్డి చేశారు. కానీ, ఆ పౌరసమాజం ఆదర్శాలను కానీ, ప్రజా స్వామికవాదుల ఆకాంక్షలను కానీ పరిపాలనలో భాగం చేసుకోలేకపోయారు. అందుతున్న హితవులను, సూచనలను ఖాతరు చేయకపోయారు. ఆయా విషయాల మీద ప్రజలకు మేలుచేసే ఆలోచనలను పంచుకోవడం బుద్ధిజీవుల కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణ అనివార్యంగా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతుంది. అయాచితంగా, సమాజం మేలుకోరి అందుతున్న సూచనలను ఆలకిస్తే, అడుగడుగున ప్రమాదాలు ఎదురుకావు!





మంచి వ్యాసాలు చదువుతున్నాం సార్
Sir, Namaskaram… Thala boppikadutunna thappula meeda thappulu..hundred percent Correct.. public lo ippatike apakjyathi techukunnaru, CM gari vyvaharisthunna thiru chusthunte… aathma samrakshana lo padinatlu spashtamavuthondi, ippatike Govt prathishta chala varaku digajarindi, ippudu ye election jariginaa congress ku eduru debba thappanisari kanundi… CM ku eduraina, edurkontunna paristhithulanu baga vishleshincharu sir … Thank You Sir
తన గురువుని చూసి నేర్చుకోవాల్సింది శానా ఉంది