– ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూదిల్లీ, జనవరి 1: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ’నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక. ఆత్మపరిశీలనకు, కొత్త సంకల్పాలు తీసుకొనేందుకు మంచి అవకాశం. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతను చాటుకుందాం. 2026 మనందరి జీవితాల్లో శాంతి, సంతోషం తీసుకురావాలనిమరింత బలైమన, సుసంపన్నమైన భారత నిర్మాణానికి కొత్త శక్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే మన సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు తమ సందేశాన్ని తెలిపారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


