మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంలో పురోగతి

– ప్రైవేట్‌ ‌డాక్టర్ల  మత్తు వ్యాపారం గుర్తింపు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ ‌చేశారు. రోగులకు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ మోతాదులో మత్తు ఇచ్చినందువల్లే వారు మృతిచెందినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆటోలోనే కుప్పకూలి మరణించడంతో ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విశ్లేషించి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై పలు ఆధారాలు సేకరించారు. రోగులకు చికిత్స చేసేందుకు వాడాల్సిన మత్తు ఇంజెక్షన్లను ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కి చెందిన డాక్టర్‌ ‌జైపాల్‌ ‌రెడ్డి బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్ముతున్నాడు. అతడి ద్వారా ఈ ప్రమాదకర ఇంజెక్షన్లు బయటకు వెళ్లినట్టు పోలీసులు నిర్దారించారు. ఈ వ్యవహారంలో మరో హాస్పిటల్‌కి చెందిన ఇంకో వైద్యుడి పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇరువురూ కలిసి అక్రమంగా అనస్తీషియా ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ ‌చేశారు. హాస్పిటల్‌ల్వ ఉన్న ఔషధాలను దారిమళ్లించి మత్తుకు అలవాటుపడిన వారికి అమ్ముతూ వ్యాపారం సాగిస్తున్నారని తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన ఇంజెక్షన్లను ఇలా బహిరంగంగా అమ్మడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *