– ఆరుగురు మావోయిస్టులు మృతి
– ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ ఉయికా గణేష్ కూడా..
-గణేష్‌పై కోటి రూపాయలు రివార్డు
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : కూడా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధ, గురువారాల్లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో తెలుగు మావోయిస్టు కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ గణేష్ మృతిచెందాడు. కాగా, గణేష్‌పై ఒక కోటి రూపాయలు రివార్డు కూడా ఉంది.వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్‌ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ గణేష్ మృతి చెందాడు.గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామంగా గుర్తించారు.గత 40 సంవత్సరాలుగా గణేష్ మావోయిస్టు సంస్థలో చురుకుగా పనిచేస్తున్నాడు. దండకారణ్య ప్రాంతంలో స్థానిక స్థాయిలో మావోయిస్టు సంస్థను బలోపేతం చేయడంలో, భద్రతా బలగాలపై తీవ్రమైన దాడులకు ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గణేష్ బీఎస్సీ డిగ్రీ చేసిన తర్వాత అడవి బాట పడ్డాడు.ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్‌ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి.ఈ కాల్పల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ గణేష్ మృతి చెందాడు.ఈ క్రమంలో లొంగిపోవాలని మావోలను.. బలగాలు హెచ్చరించాయి. తొలుత మావోయిస్టుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు కాల్పులు మొదలుపెట్టారు. దాదాపు నాలుగైదు గంటలపాటు ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ టీంలతో కలిసి ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసు బృందాల జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా గణేశ్ అలియాస్ హనుమంతు ఎన్కౌంటర్‌ను స్పెషల్ ఆపరేషన్స్ ఏడీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కంధమల్ – గంజాం పరిధి రాంభా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ లు, ఒక 303 రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు.3 ఏళ్ల క్రితం కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో దళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.అలాగే గతంలో ఛత్తీస్ ఘడ్ లో గనేష్ అలియాస్ హనుమంతు పనిచేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గణేష్ కదలికలను భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఎస్‌ఓజీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.అతడు కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషాలో మావోయిస్టుల అగ్రనేత కూడా. ఆ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతల్లో ఒకడు. అతడి తలపై వివిధ రాష్ట్రాల్లో కోటి రూపాయల రివార్డు ఉంది. మిగిలిన ముగ్గురు మావోయిస్టుల గుర్తించాల్సివుంది.చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1961లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు చండూరులో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ నల్గొండలో చేస్తూ రాడికల్ యూనియన్లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి ఆయన తిరిగి ఇంటివైపు చూడలేదు. ఆయన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా రాలేదు. మండల కమిటీ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి నేతగా ఎదిగి మూడు రాష్ట్రాలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి కాలంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం.హనుమంతు చిన్నప్పటినుంచే కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నారని ఆయన సోదరుడు తెలిపారు. హనుమంతు తండ్రి సీపీఎం పార్టీలో పనిచేశారు. దీంతో హనుమంత్ చదువుకునే రోజుల్లోనే ఉద్యమం వైపు వెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




