తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దున కర్రెగుటల్లో భారీ ఎన్ కౌంటర్ .

 22 మంది మావోయిస్టులు  మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర,మే 07 : తెలంగాణ చత్తీస్ ఘడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట లో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా పిఆర్పీ ఎప్ బలగాలు ఛత్తీస్‌ గఢ్-తెలంగాణ సరిహద్దు లోని గుట్టల మధ్యలోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. బుధవారం ఉదయం కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఎన్ కౌంటర్ ను అధికారికంగా ధృవీకరించారు. ఇక ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన ఘటనలో అధికారులు 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.భద్రతా బలగాలు కర్రెగుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయి. ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయ గా, అలుబాక శివారులో మరో క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *