జార్ఖండ్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి.

మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్, సొరెన్ ఉన్నారు.

భద్రాచలం , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : జార్ఖండ్ రాష్ట్రంలోని హజారి బాగ్ దట్టమైన అడవి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నారు. ఆయనతోపాటు మరో కమిటీ సభ్యుడు సోరెన్ ఉన్నారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా మా వయసులో ఏరువేత కోసం భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా మావోయిస్టులు తారస్పడటంతో ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ తలపై కోటి రూపాయలు రివార్డు ఉంది. సొరన్ తలపై 25 లక్షలు రివార్డు ఉంది. రఘునాథ్ తలపై 10 లక్షలు రివార్డు ఉంది. సంఘటన స్థలం వద్ద ఏకే 47 ఆయుధాలతోపాటు మందు గుండు సామాన్లు ఉన్నాయి. వీటిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *