బీజాపూర్‌ ‌జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

 – నలుగురు మావోయిస్టులు మృతి
– ఆపరేషన్‌ని ధ్రువీకరించిన బీజాపూర్‌ ‌జిల్లా పోలీసులు

భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 26 : ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఇప్పటివరకు 4గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే శనివారం నాడు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లా గంగులూరు అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు అటవీప్రాంతంలోకి ప్రవేశించారు.ఈ సమయంలో ఇరువురి మద్య భీకరమైన కాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.4గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు,  రైఫిల్స్, ‌పేలుడు పదార్థాలు మరియు రోజువారీ ఉపయోగించే వస్తువులు సహా అనేక ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఆపరేషన్‌ ఇం‌కా కొనసాగుతున్నందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.నలుగురు మావోయిస్టులు మృతి చెందారని బీజాపూర్‌ ‌జిల్లా పోలీసులు దృవీకరించారు.అలాగే భారీగా ఆయుధాలను స్వాదీనం చేసుకున్నారు.అంతేకాకుండా సంఘటనా స్థలం వద్ద మావోయిస్టుల మృత దేహాలను కూడా స్వాదీనం చేసుకున్నారు.ఇంకా గుర్తించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *