పదేళ్ల నిరీక్షణకు తెర..

922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు
నెల రోజుల్లో గ్రూప్‌ 2, 3 నియామకాలు పూర్తి..
ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందం
నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు..
జడ్పీటీసీ అయినప్పుడు ఎంతో సంతోషడ్డా..
సీఎం రేవంత్‌ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

ఉద్యోగ నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం అభ్యర్థులు ఎదురు చూశారనినేటితో వారి కల నెరవేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని ఆయన తెలిపారు. నేను జడ్పీటీసీ అయినప్పుడు ఎంతో సంతోషపడ్డాను.  సీఎం అయినప్పటి కంటే ఎక్కువ అప్పుడే ఆనందపడ్డాను.. కొందరికి అవకాశాలు రావు. మీకు కూడా ఇది తీపి గుర్తుగా ఉంటుంది. కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం 2015 నుంచి ఇవ్వలేదు. క్రమం తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఇది.” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
పదేళ్లు.. మీరు మీ కుటుంబమే పంచభక్ష పరమాన్నం తిన్నారని విమర్శించారు. ఈ పిల్లల సంతోషం మీకు పట్టలేదు. మీ ఇంట్లో మీ పిల్లలను నిజామాబాద్ ఎంపీగాకరీంనగర్ ఎంపీగా ఓడిపోయారు. ఆరు నెలలు తిరగక ముందే కారుణ్య నియామకాలు చేశారు. మీకు పేదల మీద కారుణ్యం ఎందుకు చూపలేదు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వొస్తాయని అనుకున్నారు.. గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.. గత ప్రభుత్వం ఎన్ని నియామకాలను చేపట్టింది. ఎన్ని పరీక్షలను సజావుగా నిర్వహించింది. మీ కుటుంబ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చింది మా ప్రభుత్వం.. 10 నెలల్లో మేము చేసిన పనులను.. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు. అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నోటిఫికేషన్లు అన్నీ మేము ఇచ్చినవేనని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.. మీ కుటుంబంలో వారిని ప్రజలు తిరస్కరిస్తే.. నెలల్లోనే వేరే పదవులను కేసీఆర్ ఇచ్చారు. వారి హయంలో పేదోళ్లకు అనుమతులు కావాల్సి ఉండే. పెద్దోళ్ళ్ళకు అనుమతులు అసలే అక్కరకు లేదు అన్నట్టు పనిచేశారు. భూమి చెరువులో ఉందా.. నాలాలో ఉందా.. తెలియదు. ఇప్పుడు ఎంత పెద్దోడు ఐనా.. బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. పారదర్శక పాలన ఇవ్వాలని ఇవన్నీ చేస్తున్న. తెలంగాణ మోడల్ కావాలని న ఆలోచన. ” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నాపై అనవసరంగా దుష్ప్రచారం

తన మీద వ్యతిరేకత వొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసినందుకే నాపై ప్రజలు కోపంగా ఉన్నారాఅని ప్రశ్నించారు.   గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వం కారుణ్య నియామకాలను చేపట్టింది. నా మీద వ్యతిరేకత వొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.  ప్రజలు నాపై కోపంగా ఎందుకు ఉంటారుమహిళలకు ఉచిత బస్సు కల్పించినందుకానాపై కోపం..ఉద్యోగాలు ఇచ్చినందుకా నాపై కోపంరుణమాఫీ చేసినందుకా నాపై కోపం? 59వేల మంది ఉద్యోగాలు ఇచ్చినందుకానాపై కోపం అని ప్రశ్నించారు.  

నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు.
కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల మీరు పదేళ్లు నష్టపోయారు. జాబ్‌ క్యాలెండర్‌తో పాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిది. స్వరాష్ట్రం వొచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదు. పేదలుబడుగు బలహీన వర్గాల వారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. నిరుద్యోగుల బాధలను ప్రజా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు.  నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మాకు ఉద్యోగాలు ఇవ్వని మీకు ఉద్యోగాలు ఎందుకని నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు. నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్‌ పెట్టొద్దని ఆదేశాలిచ్చా. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చాం. 30, 40 రోజుల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం. ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *