– ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ పెండింగ్ బిల్లులు కూడా
– డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండిరగ్ బిల్లులు అక్టోబర్ నెలకు సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఒకేసారి విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి రూ.712 కోట్లను డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా రూ.10 లక్షల లోపు పెండిరగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లను సైతం విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



