హ‌రిత ఇంధ‌నానిదే భ‌విష్య‌త్తు

– గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడి కి ఎంఓయూ లు
– 2030 నాటికి 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
-డిమాండ్ మేర‌కు విద్యుత్ ఉత్ప‌త్తి పెంచాలి
– డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క

 భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్ దే, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యరంగంగా గుర్తించి, ప్రణాళికలతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి సంబంధించి లక్ష కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూ లు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం 20 25 న్యూ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది, 2029 – 30 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 200 మెగా వాట్ల  గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్తు వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలను అన్వేషిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగులు విద్యుత్ దిశగా ముందుకు పోతుందని తెలిపారు. ఈ ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికి విద్యుత్తు అవసరం, ఉత్పత్తి పెరగాలంటే విద్యుత్తు సరఫరా పుష్కలంగా ఉండాలి, ఉత్పత్తులు పెరిగితే ఉపాధితో పాటు రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది ఇదంతా ఒక చక్రంలా తిరుగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది కేవలం బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఖర్చు పెరగడంతో పాటు, కాలుష్యం పెరిగి వాతావరణ సమ‌తుల్యం దెబ్బతింటుంది.
ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం గ్రీన్ పవర్ వైపు పరుగులు పెడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని దేశాలు సోలార్ తో పాటు విండ్, థర్మల్, అప్పుడు స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ వంటి మార్గాల ద్వారా విద్యుత్పత్తిని ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నామ‌న్నారు. పగలు సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టోరేజీ చేసుకొని, రాత్రివేళ  స్టోరేజ్ ద్వారా పీక్ అవర్స్ లో విద్యుత్తు ఉత్పత్తి చేయడం విదేశాలకు సరఫరా చేస్తున్న గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును కంపెనీ యాజమాన్యం ఆహ్వానం మేరకు గ్రీన్ పవర్ ఉత్పత్తి పరిశీలనకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామానికి వచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రీన్ కో పవర్ కంపెనీ అనుకున్న సమయానికి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించడం అభినందించదగిన విషయం అన్నారు. వారు 4వేల ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట సోలార్, విండ్, పంపుడ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. గ్రీన్ కో కంపెనీ సోలార్ ద్వారా నాలుగు వేల మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా వేయి మెగావాట్లు, పంప్డ్ స్టోరేజీ ద్వారా 1,680 మెగావాట్లు మొత్తంగా ఒకే చోట 6,680 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి అభినందించదగిన విషయం అన్నారు. దేశంలో భవిష్యత్తులో గ్రీన్ కో వంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
గ్రీన్ కో పవర్ ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం
గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా భాగంగా డిప్యూటీ సీఎం ప్రాజెక్ట్ సైట్‌పై హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. క్లోజ్డ్-లూప్ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్‌కు సంబంధించిన ఎగువన మరియు కింది రిజర్వాయర్లు, పవర్‌హౌస్ కాంప్లెక్స్, ఆధునిక సబ్ స్టేషన్ వంటి కీలక మౌలిక సదుపాయాలను పరిశీలించారు. గ్రీన్‌కో సంస్థకు చెందిన ఇంజినీర్లు మరియు నిర్వహణ బృందంతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రాజెక్టులో సోలార్ పవర్, విండ్ పవర్ మరియు రోజుకు రెండు సార్లు నాలుగు గంటల నిల్వ సామర్థ్యంతో కూడిన 1,680 మెగావాట్ల హైడ్రో పవర్ నిల్వ వ్యవస్థ కలిపి నిర్వహిస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం తన అధికార బృందంతో కలిసి పర్యటించారు. డిప్యూటీ సీఎం వెంట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, జెన్ కో సిఎండి హరీశ్, దేవరకద్ర నియోజకవర్గం ఎంఎల్ ఎ మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎంఎల్ ఎ మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *