బీజేపీ అధ్యక్ష ఎన్నికకకు రంగం సిద్దం

– 19న నామినేషన్లు.. అవసరమైతే 20న ఎన్నిక

న్యూదిల్లీ, జనవరి 16: బీజేపీ కొత్త సారథి ఎన్నికకు సమయం ఆసన్నం అయింది. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఈ పదవికి ఈనెల 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది. ఆ మరుసటి రోజు 20వ తేదీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడిరచింది. ఈ మేరకు పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.లక్ష్మణ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2-4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతారు. సాయంత్రం 5-6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అవసరమైతే 20వ తేదీన పోలింగ్‌ నిర్వహించి విజేతను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ పక్రియంతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. కాగా, ఇటీవల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన 45 ఏళ్ల నితిన్‌ నబీన్‌నే నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడడంలో భాగంగా నబీన్‌కు పార్టీ సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్‌కు చెందిన నితిన్‌ను భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ గతేడాది డిసెంబరులో పార్టీ అనూహ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాయస్థ సామాజికవర్గానికి చెందిన నబీన్‌ సిన్హాకు ఆరెస్సెస్‌ నేపథ్యం ఉంది. గతేడాది జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపుర్‌ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీహార్‌ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలి నేతగా నబీన్‌ గుర్తింపు సాధించారు.

—————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *