హైదరాబాద్, ప్రజాతంత్రá, జనవరి 29: రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదులు చేయడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే.. వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని ఎసఈసీ పేర్కొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పక్రియ ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదిన పోలింగ్ జరగనుంది, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



