అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదు

– టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, ఏఐల విషయంలో జాగ్రత్త
– కేంద్రాన్ని హెచ్చరించిన ఆర్థిక సర్వే

న్యూఢిల్లీ, జనవరి 29: వస్తువులు, సేవల విషయంలో అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా టెక్నాలజీ, సెవిÖ కండక్టర్స్, ఏఐ, ట్రేడ్ కంట్రోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే అమెరికా, చైనా దేశాల మధ్య భారత్ క్రాస్ ఫైర్ అవ్వక తప్పదని తెలిపింది. కేంద్ర బడ్జెట్ 2026 ` 27 సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ’ది ఎకనామిక్ సర్వే 2025 ` 26’ భారత్‌ను హెచ్చరించింది. అమెరికా, చైనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎకనామిక్ సర్వే ప్రకారం.. ప్రపంచ రాజకీయాల్లో చైనా, అమెరికా దేశాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. చైనాను అన్ని రంగాల్లో వెనక్కు తోసేయాలని అమెరికా.. అమెరికాను అన్ని రంగాల్లో వెనక్కు తోసేయాలని చైనా పావులు కదుపుతున్నాయి. అమెరికా ఆధిపత్యం సాగిస్తున్న రంగాలపై చైనా ద ష్టి సారించింది. అమెరికా కూడా అదే పని చేస్తోంది. ఒకే విధమైన ఆలోచనలు ఉన్న దేశాలను కలుపుకొని సెక్యూర్ ఏఐ ఎకోసిస్టమ్‌ను తయారు చేయాలని అమెరికా చూస్తోంది. సాధారణంగా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, క్రిటికల్ ఏపీఐలు, సెవిÖ కండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం కొనసాగిస్తున్న దేశాలే ప్రపంచ రాజకీయాల్లో పవర్‌ను కలిగి ఉంటాయి. భారత్ ఈ రెండు దేశాలపై ఆధారపడటం తగ్గించాలి. వస్తువులు లేదా సేవల విషయంలో ప్రత్యామ్నాయం లేని దేశంగా తప్పకుండా ఎదగాల్సిన అవసరం ఏంతైనా ఉంది. అలా చేయకపోతే ప్రపంచ రాజకీయాల్లో భారత్ పట్టు కోల్పోతుంది. అమెరికా, చైనాల మధ్య జరిగే గొడవల వల్ల భారత్ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. చైనా గనుక దిగుమతులపై ఆంక్షలు విధించినా లేదా ధరల్ని పెంచినా దాని ప్రభావం భారత తయారీ రంగంపై తీవ్రంగా ఉంటుంది. అలాగే అమెరికా.. పాలసీలను కఠినతరం చేస్తే దాని ప్రభావం భారత సర్వీస్ సెక్టార్‌పై తీవ్రంగా ఉంటుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *