– అవార్డును అందుకున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ (బీఆర్ఏపీ-2024)లో తెలంగాణ రాష్ట్రం టాప్ అచీవర్‌గా గుర్తింపు పొందింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) భారత ప్రభుత్వం – రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను బలోపేతం చేయడానికి బిజినెస్ రిఫా ర్మ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఏపీ)- 2024 అనే 7వ ఎడిషన్‌ను ప్రారంభించింది. వ్యాపార సౌలభ్యాన్నిపెంపొందించడానికి విస్తృతమైన సంప్రదింపులు, వాటాదారుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన బీఆర్ఏపీలో 434 సంస్కరణల పాయింట్లు ఉన్నాయి. ఇవి కార్మిక చట్టాలు, భూసంవహన పరిపాలన, ఆస్తి రిజిస్ట్రేషన్, పెట్టుబడి సౌకర్యాలు, పర్యావరణ అనుమతుల వంటి కీలక అంశాలను కవర్ చేస్తాయి. బీఆర్ఏపీ 2024 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాన సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడమేకాక 13 శాఖల్లో 1,467 కాంప్లయెన్స్‌లను తగ్గించింది. దీని ద్వారా సమర్థవంతమైన పరిపాలన, పారదర్శకత, వ్యాపారానుకూల వాతావరణం పట్ల రాష్ట్రం కట్టుబాటు మరోసారి వెల్లడైంది. ఈ విశిష్ట ప్రదర్శనకు గుర్తింపుగా రాష్ట్రం బీఆర్ఏపీ 2024లో నాలుగు ప్రధాన విభాగాల(బిజినెస్ ఎంట్రీ, కన్‌స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబులర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్)లో టాప్ అచీవర్ గౌరవాన్ని సాధించింది. ఈ అవార్డును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం దిల్లీలో స్వీకరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



