ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం

– త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని అంత త్వరగా భవనాలు, సకల సౌకర్యాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలిపారు. కొత్తగూడెంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ భూమి పూజ  కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే  అతి పెద్ద‌ది అని చెప్పారు. పూర్తిస్థాయి యూనివర్సిటీ  దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదన్నారు. ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ద్వారా భూమి, భూమి లోపల ఉన్న పొరలు, భూమి లోపల ఉన్న ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాలపైన పరిశోధనలు చేయడమేకాక తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే అత్యున్నత యూనివర్సిటీకి సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో భూమి పూజ చేసి పనులు మొదలుపెట్టామని తెలిపారు. అత్యున్నత యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఈ దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *