DSC Application Deadline Extension

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వాస్తవానికి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం ఈ నెల 21తో గడువు ముగుస్తుంది. రేపటి వరకు డబ్బులు చెల్లించేందుకు అవకాశం కల్పించగా, 21తో దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ గడువును 28 వరకు పొడిగించారు. రాష్ట్రంలో 5089 టీచర్‌ ‌పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్‌ ‌వెలువడిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *