నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మకండి

– వీసా దరఖాస్తుదారులకు అమెరికన్‌ ఎం‌బసీ హెచ్చరిక

న్యూదిల్లీ, డిసెంబర్‌ 27:‌ మీడియేటర్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వీసా దరఖాస్తుదారుల కు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యం లో హెచ్‌-1‌బీ వీసా ప్రాసెసింగ్‌, ‌రెన్యువల్స్ ఆలస్యమవుతుండటంపై యూఎస్‌ ఎం‌బసీ స్పందించింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొందరు నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఎలాంటి జాప్యాలకు తావు లేకుండా వీసా లభించేలా చూస్తామంటూ ఆ నకిలీ ఏజెంట్లు దరఖాస్తుదారుల్ని సంప్రదిస్తున్నారని అప్రమత్తం చేసింది. అలాంటి హామీలను నమ్మొద్దని, దానివల్ల ఆర్థికంగా నష్టం, ప్రయాణ ప్రణాళికల్లో ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్స్ ‌వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. వీసా అపాయింట్‌మెంట్లు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే షెడ్యూల్‌ అవుతాయని స్పష్టం చేసింది. ఈ పక్రియ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఎవరైనా వీసా ఇప్పిస్తామంటే అది మోసం కిందికే వస్తుందని హెచ్చరించింది. అధికారిక పక్రియలో భాగంగా పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని సూచించింది. అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ ‌మీడియా వెట్టింగ్‌ ‌పాలసీ కారణంగా భారత హెచ్‌-1‌బీ దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. దాని కారణంగా కొన్ని నెలల పాటు వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ఈ వ్యవహారంపై మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికా వర్గాలతో చర్చిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌వెల్లడించిన సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *