– ప్రభుత్వ హామీతో నిరసన కార్యక్రమాలన్నీ రద్దు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రూ.1,500 కోట్లు అడిగాయి.. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం.. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం.. ఇంకో రూ.300 కోట్లు కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భట్టితోపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రితో యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శుక్రవారం చర్చలు జరిపారు. ప్రభుత్వ హామీతో నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్టు సంఘం ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక కమిటీ వేయాలని కళాశాలల యాజమాన్యాలు అడిగాయి.. త్వరలో కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక వచ్చేలా చూస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కమిటీలో అధికారులతోపాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని, ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేనపైన కానీ, సీఎం కార్యాలయ, డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులపై కానీ తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము మీడియా సమావేశంలో ఒకటి మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరించాయని ప్రతినిధులు స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల పట్ల తమ సంఘం నుంచి ఒక ఖండన ప్రకటనను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపామని ‘పాతి’ అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ తెలిపారు. 3వ తేదీనుంచి సమ్మెకు వెళ్లామని, ఫలితంగా కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు చింతిస్తున్నామని, నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాటు చేస్తాంమని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు సఫలమైనందున రేపటి లెక్చరర్ల ప్రదర్శనను రద్దు చేసుకుంటున్నామన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో లెక్చరర్ల ప్రదర్శన తప్పు అని కోర్టు చెప్పిందని ఫాతి జనరల్ సెక్రటరీ రవికుమార్ తెలిపారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధప్రకా. ఇంటలిజెన్స్ ఐజీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





