మేధావులతో బీసీ కమిషన్ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్సును తీసుకురావాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్ బీసీ మేధావులతో శనివారం సమావేశమైంది. వారి అభిప్రాయాలను, సలహాలను స్వీకరించింది. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురయ్యే సమస్యలు, అందుకనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు గురించి చర్చించారు. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, స్పెషల్ ఆఫీసర్ జి.సతీష్‌కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి.లక్ష్మీనారాయణలతోపాటు మేధావులు శ్యాంమోహన్, సి.ఆర్.గౌరీశంకర్, రావమ్‌నందన్ స్వామి, లక్ష్మణ్‌యాదవ్, గంటి చంద్రుడు, కె.వి.గౌడ్, బైరి శేఖర్, పి.నరేంద్రబాబు పాల్గొన్నారు.



