జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

– మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 10: వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు కల్పించాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కలెక్టర్ దివాకర టి ఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి ఆమె శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులను, ఫ్లోరింగ్ పనులను, క్యూ లైన్ షేడ్స్ నిర్మాణాలను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెలవు దినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగే విధంగా చూడాలని అన్నారు. ముఖ్య మంత్రి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభిస్తామన్నారు. గద్దెల ప్రాంగణం విద్యుత్ కాంతుల వె లుగులతో ఆకర్షనీయంగా కనిపించేందుకు నూతన ఆధునిక విద్యుత్ దీపాలను అమర్చామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆలయ పూజారులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

జలగలంచ ఫోర్ట్ వ్యూ పాయింట్ ప్రారంభం

తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ వారి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల జలగలంచ ఫోర్ట్ వ్యూ పాయింట్ మంత్రిసీతక్క శనివారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటకులు ఎక్కడికో వెళ్ళి పర్యటించి పట్టణ ప్రాంతాల్లో కలుసిత వాతావరణంలో గడిపే బదులు ములుగు జిల్లా పచ్చని అడవి అందాల పర్యాటక ప్రదేశం అని కుటుంబ సమేతంగా సరదాగా గడుపుతూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుకుం టూ ఆరోగ్యవంతమైన పర్యటన చేసుకునే విధంగా ములుగు జిల్లా స్వాగతం పలుకుతుందని అన్నారు. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తూ చాలా ప్రాంతాల ప్రజలు వాస్తు వెళుతున్నారు. గత ఏడాది పస్రా-తాడ్వాయి మధ్యలో జలగలంచ వాగు వద్ద బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ప్రారంభించామని, ఇటీవలే తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని అదే విధంగా ఈ రోజు జలగలంచ వద్ద అడవి అందాలు పర్యాట కులను ఆకట్టుకునే విధంగా ఊటీ,కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు దీటుగా మన అడవి అందాలు ఉంటాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వారు గానీ,సరిగదా కుటుంబం తో గారి, స్నేహితులు సరదాగా గడపడానికి ములుగు జిల్లా ప్రకృతి అందాల తరపున సీతక్క స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డీఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్ ,ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి అడవి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *