కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

– సూర్యాపేటజిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్ రెడ్డి

సూర్యాపేట ప్రజాతంత్ర ఫిబ్రవరి 9: సూర్యాపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి అన్నారు. ఈనెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈమేరకు సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదని తెలిపారు. పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్, ప్రభుత్వ క్రీడా పాఠశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్, డిగ్రీ, మహిళా జూనియర్ కళాశాలల ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం సూర్యాపేట పట్టణంలో డ్రైనేజ్ పైప్ లైన్ల పునర్నిర్మాణాన్ని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని పనులను ప్రారంభించిందని గుర్తు చేశారు. అనంతరం 11, 12, 40, 46, 47 వార్డులలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శక్తి సూపర్ షి స్టేట్ కోఆర్డినేటర్ విద్యారెడ్డి, యూత్ కాంగ్రెస్ పెన్‌పహాడ్ మండల అధ్యక్షుడు భూక్య శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *