– మంత్రి సీతక్కకు యూనియన్ ప్రతినిధుల విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించాలని ఐఎన్‌టియుసి అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంత్రిని కలిసి అంగన్‌వాడీ లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ రూపంలో పౌష్టికాహారం అందజేస్తామని, అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు బతుకమ్మ ఆడుకునే అవకాశం కల్పించాలని మంత్రి సీతక్కకి వినతి పత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తులపై
మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇందుకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





