-దిల్లీ బాంబర్ ఉమర్ ఇల్లు పేల్చివేత
శ్రీనగర్,నవంబర్14: దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కారణమైన ముష్కరుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా బలగాలు పేల్చి వేశాయి. దేశద్రోహానికి పాల్పడ్డ ఈ దుండగుడి ఇంటిని పేల్చేయడం ద్వారా గట్టి సమాధానం ఇవ్వాలని, గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించారు. దిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోట వద్ద పేలుడు చోటుచేసుకున్న కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. జమ్మూకశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కూల్చివేత పక్రియను చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దిల్లీ పేలుడుపై కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఉమర్ ఇంటిని ధ్వంసం చేసినట్లు తెలిపాయి. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హ్యుందాయ్ ఐ20 కారు కారణంగానే ఈ పేలుడు జరిగిందని అధికారులు గుర్తించారు. పలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దీన్ని డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు కనుగొన్నారు. కారులో దొరికిన ఆనవాళ్లను అతడి కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో పరీక్షించగా.. కారు నడిపింది ఉమరే అని తేల్చారు. ఈ పేలుడులో అతడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధరించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు ఛేదిస్తున్న క్రమంలో ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఉమర్‌కు ఈ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉగ్ర నెట్‌వర్క్ వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




