మృత్యువు

ఎక్కడ చావుందో అక్కడ పుట్టుక వుంది
ఎక్కడ పుట్టుక వుందో అక్కడ చావుంది
వెలుపల దైవముండగా గుడి కూలితేముంది
మరణమంటే భయమేందుకు అది విముక్తి

నీవు పుట్టగానే నీతో మృత్యువు పుట్టింది
మరణం నుంచి ఎంత దూరం పరిగెత్తగలం
నీవు చనిపోతావు నీ వాళ్లు చనిపోతారు
కానీ మృత్యువు మాత్రం బ్రతికేవుంటుంది

మరణం మూగవాళ్ల తో మాట్లాడిస్తుంది
మరణం దుర్మార్గుడి సజ్జనుడిని చేస్తుంది
చావు నీవంటే యేవరో చెబుతుంది
గొప్ప బతకడంలో లేదు చావడంలోనే వుంది

కనకం కొలిమిలో కరిగిపోతుంది
అది కాదు దాని మృత్యువు
స్వర్ణం రూపాంతరం చెందుతుంది
చుట్టూ నిశ్శబ్దం అది మనిషి మృత్యువు

మరణాన్ని ఎవ్వరు అడ్డుపడి ఆపలేరు
మృత్యువునెవ్వరు అర్ధం చేసుకోలేరు
మరణ చింతయెప్పుడయితే మానుతారో
అప్పుడే మన జీవనం మొదలవుతుంది

ఎక్కడేక్కడికో వెళ్లాలనీ బయలుదేరి
గమ్యం వదిలి వేరే తీరం చేరుతాం
గాలిలో దీపం ఎప్పుడైనా ఆరిపోవచ్చు
మృత్యువు జీవితమంతా నిజం

ఒకడు స్వర్ణనగలతో అలంకరించుకున్నాడు
మృత్యువు అతనిని మోహించింది
ఒకడు తిండి లేక అలమటిస్తున్నాడు
మృత్యువు అతనిని కరుణించింది

           – ఐ.చిదానందం
చరవాణి – 8801444335

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *