హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: భారత్ క్రికెటర్ తిలక్‌వర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో తిలక్‌వర్మ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డికి తిలక్‌వర్మ క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





