పోగుతో ఫోన్ బంధం.. క్యూఆర్ కోడ్‌ శాలువా సృష్టి

– సిరిసిల్ల నేత‌న్న న‌ల్ల విజ‌య్ కుమార్ సృష్టి
– 15 రోజుల‌పాటు శ్ర‌మించి రూప‌క‌ల్ప‌న‌
– క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క‌నిపించే తెలంగాణ క‌ట్ట‌డాలు
– ఆవిష్క‌రించిన కేటీఆర్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్’  శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తన నంది నగర్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.  “పోగు బంధంతో ఫోన్ బంధం” అనే కాన్సెప్ట్‌తో ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా, కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్‌ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించడం విశేషం. నేతన్న నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ: “మా నాన్న గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. గతంలో నేను రంగులు మారే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినప్పుడు, అప్పటి సీఎం కేసీఆర్  చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం నా అదృష్టం. కేసీఆర్  తెలంగాణకు చేసిన అభివృద్ధిని, మన వారసత్వ సంపదను పదిమందికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్ శాలువాను రూపొందించా. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే నా లక్ష్యం,” అని తెలిపారు. ఈ అద్భుత ఆవిష్కరణను కేటీఆర్ గారి ద్వారా కేసీఆర్ కు అందించాలనే తన కోరికను విజయ్ వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్, తప్పకుండా ఈ శాలువాను కేసీఆర్ గారికి అందజేస్తానని హామీ ఇచ్చారు. నేతన్నలకు కేటీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నాన్న స్పూర్తితో సృష్టి : విజయ్ కుమార్ 

“గతంలో మా నాన్న అగ్గి పెట్టెలో పెట్టే చీర తయారు చేశాడు. అదే స్పూర్తితో నేను గతంలో కూడా అనేక రంగులు మారే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశాను. నాకు బీఆర్ ఎస్‌ ప్రభుత్వంలో కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం కూడా వచ్చింది. కేసీఆర్ అభివ్రుద్ది చేసిన వాటిని, తెలంగాణ వారసత్వ సంపదను, దేవాలయాలను శాలువపై క్యూఆర్ కోడ్ తో రూపొందించాలని ఆలోచన వచ్చింది. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి ఆలయం కూడా ఈ క్యూఆర్ లో రూపొంచాను. ఈ కొత్త ఆవిష్కరణలు కేసీఆర్ కు అందించాలని ఇవాళ కేటీఆర్ తో ఆవిష్కరింప‌జేశాను. కేటీఆర్ ఆవిష్కరించి మమ్ములను అభినందించారు. క్యూఆర్ కోడ్ శాలువ ను కేసీఆర్ కు అందిస్తాను అని కేటీఆర్ చెప్పారు ” అని న‌ల్ల విజ‌య్ తెలిపారు. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు అడ్డా సిరిసిల్ల. అలాంటి సిరిసిల్ల‌లో నల్ల విజయ్ తెలంగాణ చరిత్ర తెలిసేలా క్యూఆర్ శాలువ ను 15రోజుల పాటు కస్టపడి రూపొందించాడు. గతంలో కూడా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. కేటీఆర్ ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *