– ఐదు కేసుల్లో బెయిల్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 7: పైరసీ వెబ్‌సైట్ ’ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్లపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కోర్టులో అతనికి చుక్కెదురైంది. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నందున బెయిల్ ఇస్తే దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. తాను హైదరాబాద్ వదిలి వెళ్లనని, పోలీసు విచారణకు సహకరిస్తానని అతను కోర్టుకు తెలిపారు. ఇకపై పైరసీ చేయనని విన్నవించుకున్నాడు. మరోవైపు కేసు దర్యాప్తు దశలో ఉన్నదని, బెయిల్ ఇస్తే అతను విదేశాలకు వెళ్లిపోయే అవకాశముందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రవి అభ్యర్థనను తోసిపుచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



