కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలి

– ముఖ్యమంత్రికి హైకోర్టు సీజే సూచన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎంసీహెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల్లో అవసరమైనచోట కోర్టు భవనాలు, మౌలిక వసతులు కల్పించడంతోపాటు సిబ్బంది నియామకం చేపట్టాలని సీజే ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాధాన్యతల వారీగా వివిధ జిల్లాలతోపాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, జస్టిస్‌ పి.సామ్‌ కోశి, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావలి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *