మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

-కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సీతక్క

మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొనుగోలు కేంద్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. గురువారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో సీతక్క పర్యటించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొక్కజొన్నలు ప్రైవేట్ దళారీలకు విక్రయించి మోసపోవద్దని ఈ సందర్భంగా రైతులకు మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. ఒక్క ఎకరాకు 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు కాకుండా 50 క్వింటాలు పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఇబ్బంది పడకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *