కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లు

– పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సూచనలు
– కోర్‌ ఏరియా అభివృద్ధిపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో వీధుల ఆధునికీక‌ర‌ణ‌, సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్‌ కోర్‌ అర్బన్‌ ఏరియా అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోచ్చారు. ఐదు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. అయితే అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండిరగ్‌ జోన్స్‌ను ఏర్పాటు చేయాలని, మల్టీ స్టోరేజ్‌ బిల్డింగ్స్‌, ఫైర్‌ సేఫ్టీ అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వీధి దీపాలకు సోలార్‌ విద్యుత్‌ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్‌ ప్రాజెక్టుగా సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల అప్‌ గ్రేడేషన్‌తోపాటు విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను స్ట్రీమ్‌ లైన్‌ చేసి రీ లొకేట్‌ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, సీఎం సెక్రటరీలు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, డీజీపీ జితేందర్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *