న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం టీపీసీసీ సమన్వయ కమిటీని ఏఐసీసీ నియమించింది.
ఎనిమిదిమందితో కూడిన కమిటీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ ర్పుానర్సింహ, సీతక్క, సీడబ్ల్యుసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయంతోపాటు సమర్థవంతమైన పనితీరు, సజావుగా పనులు జరిగేలా ఈ కమిటీ పనిచేస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




