డ్రగ్ నిర్మూలన కు స‌హ‌క‌రించాలి

– విద్యార్థులకు మంత్రి అజహరుద్దీన్ సూచ‌న‌

కార్వాన్ ,ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10: డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు, ఫోటోలు లేదా సమాచారం ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని యువ‌త‌కు మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ సంస్థల శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ సూచించారు. డ్రగ్ నిర్మూలన కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల సహకారం అత్యంత అవసరమని అన్నారు. యువతలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, సమాజం మొత్తంగా డ్రగ్ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రోత్సహించేందుకు అవ‌గాహ‌న కార్వాన్‌లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా మంత్రి అజారుద్దీన్ హాజ‌రయ్యారు. యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో డైరెక్ట‌ర్ సందీప్ శాండాలియా సహా సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన‌గా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరుయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రీ తదితరులు నిర్వహించారు. మంత్రి అజహరుద్దీన్ విద్యార్థులతో సన్నిహితంగా మమేకమై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. చిన్న వయసు నుంచే మంచి స్నేహబంధాలు ఏర్పరుచుకోవడం ఎంతో ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో ఏర్పడే మంచి అలవాట్లు, స్నేహాలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని తెలిపారు. కళాశాల విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండడమే కాకుండా తమ స్నేహితులను కూడా ఆ దారి నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విలువలు, సద్గుణాలు నేర్పాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు శత్రువులు కాదని, విద్యార్థుల మంచికే మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. మంచి విద్య కోసం తల్లిదండ్రులు చేసే కష్టాలను గుర్తించి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, చదువుపై దృష్టి పెట్టి జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో, విద్యతో, డ్రగ్‌రహిత యువతే దేశాన్ని మరింత బలమైన, ప్రకాశవంతమైన దిశగా నడిపిస్తారని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *