– రేణుకా చౌదరి ‘శునక రాజం’ వివాదం
– సీఎం రేవంత్రెడ్డి దేవుళ్ల వ్యాఖ్యలపై దుమారం
– పవన్ కళ్యాణ్ ‘తెలంగాణ దృష్టి దోషం’
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
ఇటీవల కాలంలో నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాలను సృష్టిస్తున్నాయి. అన్యాప దేశంగా అంటున్నారో లేక కావాలని అంటు న్నారోగాని ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేసేవిగా ఉన్నాయి. విచిత్రమేమంటే ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి మత విశ్వాసాలపై చర్చకు దారితీస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యు రాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రధానం గా రాజకీయ వర్గాల్లో ఆరోపణలు ప్రత్యారోప ణలకు కారణంగా మారాయి. ఇంత దుమారం రేగుతున్నప్పటికీ రేణుకా చౌదరి ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా మీడియా ముందు తన హావభావాలతో మరింత దారుణ సమాధానం ఇవ్వడం కూడా చర్చగా మారింది. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమెపై సభాహక్కుల తీర్మానానికి సిద్ధమవుతున్నది. ఈ మొత్తం ఎపిసోడ్కు కారణం ఒక శునకరాజం పార్లమెంటు ప్రాంగణంలోకి రావడం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు కుక్కను వెంటబెట్టుకుని రేణుకా చౌదరి రావడం ఈ వివాదానికి నాంది పలికింది. పార్లమెంటు సభ్యులు, సంబంధిత అధికారులు తప్ప మరెవరూ అడుగు పెట్టడానికి వీలులేని కట్టుదిట్ట ఏర్పాట్లుండే ప్రాంతానికి కుక్కను తీసుకురావడంపై భద్రతా సిబ్బంది నిరోధించినప్పటికీ రేణుకా చౌదరి వినిపించుకోలేదన్నది ఒకటి కాగా ఆ విషయంలో కొందరుచేసిన కామెంట్లపై ఆమె ఇచ్చిన సమాధానం పలువురి ఆగ్రహానికి కాణమైంది. అది కరిచే కుక్క కాదని, కరిచే వారు లోపలున్నారంటూ పార్లమెంట్ వైపు చూపించడం తీవ్ర దుమారం లేపింది. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా పార్లమెంటు సభ్యులను కించపర్చేవిగా ఉన్నాయంటూ బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ఆమె సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుపట్టారు. అందుకు ఏమాత్రం తగ్గని రేణుకా మీడియా అడిగిన ప్రశ్నకు భౌభౌ అంటూ మరింత రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించింది. బీజేపీ వారు హిందూ హిందూ అంటారు గాని వారికి హిందూ సంప్రదాయమే తెలియదని వ్యాఖ్యానించారు. హిందూ మతంలో శునకానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేగాక విశ్వాసానికి శునకం ప్రతీక అంటూ సమర్థించుకున్నారు. ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్ సహా రాహుల్ సమర్థించారు. హిందూ దేవుళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుంది. వినాయకుడికి -ఎలుక, సుబ్రహ్మణ్యస్వామికి నెమలి, శివుడికి నంది లాగానే శివుడి ఉగ్ర రూపమైన (శివుడి -అంశ) కాలభైరవునికి నల్ల కుక్క వాహనం. దాన్ని కాలభైరవుడుగానే హిందువులు ఆరాధిస్తారు. కార్తీక మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిధినాడు కాలభైరవ జయంతిని జరుపుకుంటారు.
ఆరోజు కాలభైరవుడికి రొట్టెలు తినిపించడం అనవాయితీగా వస్తున్నది. దీని దృష్ట్యా శునకాలను తక్కువ అంచనావేయవద్దన్నదకి ి కాంగ్రెస్ అంటోంది. అయితే కుక్కను పార్లమెంటు ప్రాంగణంలోకి తీసుకురావడం కన్నా ఆమె పార్లమెంటు సభ్యులను కుక్కలతోపో *ల్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటున్న బీజేపే ఆమెపై ప్రివిలేజ్ మోషన్ కి సిద్దమవుతున్నది.
హిందూ సంప్రదాయానికి సంబందించిన మరో వివాదం రాష్ట్రంలో చోటుచేసుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయంటూ బీజేపీ, బీఆర్ ఎస్ వర్గాలతోపాటు పలువురు హిందూ సంప్రదా యవర్గాలు విరుచుకుపడుతున్నారు. మనకు మూడు కోట్లమంది దేవుళ్ళు ఎందుకున్నారు. ఒక్కొక్కరు వారి కోరికలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో దేవుడిని కొలుస్తా రంటూనే, దేవుళ్ళ విషయంలోనే మనకు ఏకా భిప్రాయం లేదంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్య లు రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని లేపింది. దీనిపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. బీజేపీ యువమోర్చా. మ హిళా మోర్చాల ఆధ్వర్యంలో గాంధీభవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వస్తున్న వీరిని అడ్డుకోవ డానికి ప్రయత్నించిన పోలీసు లకు మోర్చా కార్యకర్తల మధ్య పెనుగులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాల య్యాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అంటూ వెటకా రంగా మాట్లాడినందుకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే సిఎంకు కూడా అదే గతి పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్ర మం త్రి కిషన్రెడ్డి శాపనార్థాలు పెట్టారు. అయి తే తన మాటలను వక్రీకరించారని, తన మాటలను అసంపూర్తిగా ఎత్తిచూపి వివాదస్పదం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవా రం వివరణ ఇచ్చుకున్నారు. హిందూ దేవుళ్ళు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ పార్టీ అని జిల్లాల అధ్యక్షులతో అంతర్గతంగా మాట్లాడిన మాటలను సోషల్మీడియా వక్రీకరించిం దన్నారు.ఇదిలా వుండగా కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోడానికి తెలంగాణ దృష్టి దోషమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూ డా తీవ్ర దుమారం లేపాయి. ఉద్యమకాలంలో కూడా ఏనాడు ఏపీ నష్టాన్ని కోరుకోని తెలంగా ణపై పవన్చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఈ ప్రాంతంపై ఉన్న ద్వేషాన్ని చెప్పకనే చెబుతున్న దంటూ తెలంగాణవాదులు ద్వజమెత్తారు. దీని పై తెలంగాణ అధికార పార్టీ కూడా తన అభ్యం తరాన్ని తెలిపింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక అడుగు ముందుకువేసి పవన్క ళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, తెలం గాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాని పక్షంలో ఆయన సినిమాలను ఇక్కడ ఆడనిచ్చేదిలేదని స్పష్టంచేశారు. బీఆర్ ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత ఎదుటివారి మేలు కోరే తెలంగాణ ప్రజలపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ను డిమాండ్ చేశారు. మొత్తంమీద నాయకుల మాటలు ప్రజల్లో తీవ్ర మనస్థాపానికి దారితీస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





