– రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫోటో ప్రదర్శన
~ తిలకించిన భారత అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీలు గురువారం నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హైకోర్టు- భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు. సీబీసీ, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్‌తో కలిసి రాజ్యాంగ దినోత్సవం, వందేమాతరం @150 సమాచార ప్యానెళ్లను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం కేశవ్ మెమోరియల్ న్యాయ కళాశాల (కేఎంసీఎల్) విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ భారత ప్రాచీన రాజధర్మ సూత్రాలే పునాదిగా ఉన్న మన రాజ్యాంగం అత్యున్నత ధర్మమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ప్రవేశికను అర్థం చేసుకోవాలని, జాతీయ సమగ్రతను కాపాడాలని, రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఫలాలను గుర్తుంచుకోవాలని ఆయన విద్యార్థులను కోరారు. విధులతో పాటే హక్కులు లభిస్తాయని గుర్తు చేస్తూ… రాజ్యాంగ విలువలను సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో మాటామంతీలో భాగంగా చట్టం, రాజ్యాంగ సంబంధిత అంశాలపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానమిచ్చారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన బుధవారం ప్రారంభమవగా ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



