– పేదలకు ఆర్థిక దన్ను ఇచ్చిన ఎంజీఎన్ ఆర్ ఈజీఏ
-పేదలను దెబ్బకొట్టేలా కొత్త చట్టం తెచ్చిన బీజేపీ
– ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
– గతంలో ఎన్నో సంస్కరణలు అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్
– మనం పేదల పక్షాన నిలబడాలి
– చట్టాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించాలి
– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఉతమిచ్చిందని శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదలను, మధ్య తరగతి ప్రజలను కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేసేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్ పాల్గొనకపోవడం దురద్రుష్టకరం అని చెప్పారు. వాళ్లకు పేదల మీద ప్రేమ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ లబ్ది తప్ప ప్రజల మీద ఆలోచన లేదని విమర్శించారు. బీజేపీ తీసుకువచ్చిన చట్టానకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్ కు లేదన్నారు. అంతేకాక వారికి మద్దతుగా ఉండే ఆలోచన మాత్రమే ఉంది. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలు సమాజంలో మార్పు సమతుల్యత కోసం తీసుకువచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చింది . భూమి లేని నిరుపేదలకు భూస్వాముల భూములను పేదవాళ్లు భూమిని పంపిణీ చేసిందన్నారు. ఇది సమాజంలో అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో తీసకువచ్చిన ల్యాండ్ టెన్నెన్సీ యాక్ట్ తీసకువచ్చి భూములపై హక్కులను కల్పించామని చెప్పారు. బ్యాంకలు జాతీయీకరణ ద్వారా దేశంలోని ప్రయివేట్ బ్యాంకులను జాతీయ చేశాం. సామాన్యు లను, పేదలను, రైతులను బ్యాంకులకు తీసుకువచ్చి లోన్లు ఇప్పించాం. సమాజంలో ఎన్నో మార్పులకు ఇది ఈ నిర్ణయం నాంది పలికిందన్నారు. ఫుడ్ సెక్యూరిటీ చట్టం ద్వారా ప్రతి పేదవాడికి ఆహార బద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఒకప్పుడు కూలీ పెరగాలంటే ఉద్యమాలు జరిగేవి. లాఠీ ఛార్జీలు జరిగేవి. అలాంటవి హామీ లేకుండా ఉపాధి కూలీ చట్టం ద్వారా ఒక్కటే సారి వంద రూపయాలు పెంచి అన్ని కల్పించేవి. నిశ్శబ్ద విప్లవం ఇది. ఈ చట్టాన్ని మార్చేసి.. సమాజంను ఇబ్బందుల్లోకి నెట్టడమే. కార్పోరేట్ శక్తులకు వంత పాడేలే కొత్త చట్టం ఉందన్నారు. జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. రైట్ టు వర్క్ అనేది మా చట్టం. మీరు దానిని పూర్తిగా మార్చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పనిచేసే హక్కును ఈ ప్రభుత్వం తీసేసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మొత్తం 100 శాతం కేంద్రమే భరించాలి. గతంలో మేము అలాగే ఇచ్చాము. బీజేపీ ప్రభుత్వం కూడా అలాగే ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి 60-40కి ఎలా మారుస్తారు. ఇది రాష్ట్రాల మీద భారం వేయడమే. కర్నాటక 100 రూపాయలు ఇస్తే కేంద్రం 25 నుంచి 30 రూపాయలు ఇస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు 100 రూపాయలు ఇస్తే కేంద్రం 35 నుంచి 40 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ 100 రూపాయలు ఇస్తే రూ. 350, బీహార్ 100 రూపాయలు ఇస్తే రూ. 650య రూపాయలు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేశాయి. దేశానికి జీడీపీ ఇవ్వడమే మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం చేస్తున్నారు. పేదలకు మేలు చేసే చట్టాలకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. దీనిని ఖండిస్తున్నాం. కూలీలకు బేరం ఆడే శక్తిని తగ్గింస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారత నశించిపోతుంది. సామాజిక పరివర్తనకు ఇది గండి కొడుతుంది. ఉపాధి కూలీలందరూ ఈఆ రోజుఏ మౌనంగా రోధిస్తున్నారు. పేదల పక్షాన నిలబడేందుకు మనం ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





