నిజం గడపదాటేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుంది.. కానీ నిజానికి నిలకడ ఎక్కువ..లేటైనా లేటేస్ట్‌గా బయటకు వస్తుంది..ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెపుతున్నాం అంటే..కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ సంధర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు, అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తెలంగాణకు వరప్రధాయిని అయిన కాళేశ్వరంపై ఉద్దేశ్యపూర్వకంగానే కుట్రలు చేసినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు ప్రభుత్వం సహకరించకుండా దాటవేస్తున్న తీరును బట్టి చుట్టే స్పష్టంగా అర్థం అవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిది. గుండె శరీరంలో అన్ని భాగాలను రక్తాన్ని సరఫరా చేసినట్లే..కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ తెలంగాణ మారు మూల ప్రాంతాలకు సాగు తాగు నీటిని అందిస్తుంది.గుండె రక్తాన్ని ఎత్తిపోసినట్లే..కాళేశ్వరం గోదావరి నీటిని ఎత్తి పోస్తూ తెలంగాణకు జీవవాధారం అయింది.అలాంటి కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి..అనుమతల నుంచి మేడిగడ్డపై తప్పుడు ప్రచారం వరకూ వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారు. కాళేశ్వరం అందించిన ఫలాలతో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్‌గా మారడంతో ఉత్తరాది జాతీయ పార్టీలు తెలంగాణపై కుట్రలు చేయడం మొదలు పెట్టారు..నదుల అనుసంధాల పేరుతో దక్షిణ గంగా అయిన గోదావరిని ఉత్తరాదికి తరలించుకుపోయే కుట్రలు చేస్తున్నారు.
అయితే కాళేశ్వరం ఉంటే అటు ఏపీతో పాటు ఉత్తరాది పార్టీల లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదు కాబట్టి..కాళేశ్వరంపై ఉత్తరాది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై మేడిగడ్డపై విష ప్రచారం మొదలు పెట్టారు. .అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై ప్రతికార రాజకీయ కక్షతో కాళేశ్వరంపై విచారణ అంటూ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.జస్టిస్ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది.కేసీఆర్ నుంచి హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా అనేక మంది నుంచి వివరాలు తీసుకుంది.ఇంకా అనేక మంది మేధావులు, ఇంజనీర్లు ,అధికారులు నుంచే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని చెప్పిన వారందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది.
“సర్కారు ఆధ్వర్యంలో ఉన్న రికార్డులు ఎలా పోతాయి..?.అసలు కేబినెట్ మినిట్స్ ఎలా పోతాయి..?.ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటనలు ఉంటాయా నిన్నటిదాకా మినిట్స్ ఇస్తాం..ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని, ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం రాత్రి రాత్రికే ఫైల్స్ ఎలా మాయం అవుతాయి..?. కేబినెట్ మినిట్స్ అనేవి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై చర్చ. తెలంగాణ ప్రజల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం చేయాల్సిన పనులపై ప్రజల అభిప్రాయాలపై చర్చ. అలాంటి కేబినెట్ మినిట్స్ పోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అంటే తెర వెనుక పెద్ద కుట్రలు ఏవో జరిగినట్టు తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ పోయాయి అని ప్రభుత్వం చెపుతుందంటే సర్కార్ పూర్తి విఫలం అయిందని అర్థం..”
.మరోవైపు కాళేశ్వరం పై రేవంత్ రెడ్డి సర్కారు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ దాదాపు పూర్తి కావోచ్చింది..కాళేశ్వరం ఎలాంటి అవినీతి జరగలేదని, కేసీఆర్ సొంత నిర్ణయం కాకుండా కేబినెట్ నిర్ణయంతోనే ప్రాజెక్ట్ పూర్తైందని ఘోష్ కమిషన్ అభిప్రాయానికి వచ్చిందన్న సమాచారంతో ఎలాగైనా కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతో కమిషన్ గడువు పెంచారు..తెరపైకి కేబినెట్ లో చర్చ జరగలేదన్న అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది.. అయితే ఎంపీ ఈటల రాజేందర్ కేబినెట్ లో చర్చ జరిగిందని,ప్రతి అంశం కేబినెట్ లో చర్చ జరిగిందని,సబ్ కమిటీ నివేదికపై చర్చించామని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల ఘోష్ కమిషన్ ముందు చెప్పడంతో విచారణ మరో మలుపు తిరిగింది.దీంతో ఇష్యూ మొత్తం కేబినెట్ మినిట్స్ చుట్టూ తిరిగింది.

ఈ నేపథ్యంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ మూడు లేఖలు రాసింది. రెండు సార్లు ఘోష్ లేఖపై ప్రభుత్వం స్పందించేదు.మూడోసారి సర్కార్‌ను హెచ్చరిస్తూ లేఖ రాసింది..కేబినెట్ మినిట్స్‌ను ఘోష్ కమిషన్‌కు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సాకులు చెప్పుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంతో ఆసక్తిగా జస్టిస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే కేబినెట్స్ మినిట్స్ ఇచ్చేందుకు ఆలోచిస్తుంది.ఇవ్వాలా వద్దా అని తర్జనభర్జన పడుతుంది.నిజానికి కేబినెట్స్ మినిట్స్ కమిషన్‌ను ఇస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని, లక్ష కోట్ల రూపాయలు ప్రజా ధనం వృధా అయిందని రేవంత్ రెడ్డి అండ్ కో హడావుడి చేశారు.
.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టింది..తీర గడువు ముగిసిన తర్వాత కేబినెట్ మినిట్స్ కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సాకులు చెపుతుంది.నిన్నటి వరకు కేబినెట్ మినిట్స్ ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మాట మార్చింది.. కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యూమెంట్స్ మాయం అంటు నాటకాలు మొదలు పెట్టింది. అంతే కాదు రెండు రోజుల క్రితమే వివరాలు ఇచ్చామని కాంగ్రెస్ అనుబంధ మీడియాలో ప్రాపగాండా చేశారు. స్వయంగా ప్రభుత్వం ఘోష్ కమిషన్ కు మినిట్స్ ఇచ్చామని హడావుడి చేశారు. తీరా సమయానికి ఇప్పుడు ఫైల్స్ మాయం అయ్యాయంటూ కొత్త డ్రామాలను రేవంత్ సర్కారు స్టార్ట్ చేసింది. సర్కారు ఆధ్వర్యంలో ఉన్న రికార్డులు ఎలా పోతాయి..?.అసలు కేబినెట్ మినిట్స్ ఎలా పోతాయి..?.ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటనలు ఉంటాయా నిన్నటిదాకా మినిట్స్ ఇస్తాం..ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని, ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం రాత్రి రాత్రికే ఫైల్స్ ఎలా మాయం అవుతాయి..?.
కేబినెట్ మినిట్స్ అనేవి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై చర్చ.తెలంగాణ ప్రజల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం చేయాల్సిన పనులపై ప్రజల అభిప్రాయాలపై చర్చ.అలాంటి కేబినెట్ మినిట్స్ పోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అంటే తెర వెనుక పెద్ద కుట్రలు ఏవో జరిగినట్టు తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ పోయాయి అని ప్రభుత్వం చెపుతుందంటే సర్కార్ పూర్తి విఫలం అయిందని అర్థం.సచివాలయం రాష్ట్రం గుండెకాయలాంటిది.అనేక పాలనపరమైన విధానాలు, రాష్ట్ర బాహ్య అంతర్గత భద్రతా పరమైన విషయాలు సచివాలయంలో భద్రంగా ఉంటాయి.సెక్రటేరియట్ లేకపోతే ప్రభుత్వమే ఉందడు.పాలన ఉండదు.అలాంటి సెక్రటేరియట్‌లో ఉండే కేబినెట్స్ మినిట్స్ పోయాయి అని ప్రభుత్వం చెప్పడం అంటే ప్రభుత్వంలోనే ఉన్న పెద్దలే రాజ ద్రోహానికి పాల్పడ్డారన్నది అర్థం అవుతుంది.

కేబినెట్ మినిట్స్‌ని ప్రభుత్వమే కాపాడలేదంటే. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం పరిస్థితి ఏంటీ..ప్రజల గోప్యత పరిస్థితి ఏందీ..?..అలాంటిది ఎన్ని కీలక సమాచం సచివాలయం నుంచి మాయం అయిందో..రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన రహస్యలు ఎన్ని మాయం అయ్యాయో అని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక సమాచారం భద్రతపై కూడా ప్రజల్లో భయోందోళనలు మొదలయ్యాయి.అసలే ఇప్పుడంతా టెక్నాలజీ యుగం.టెక్నాలజీతో ఏమైనా చేయవచ్చు. అలాంటి రాష్ట్ర ప్రజలకు చెందిన అన్ని రకాల డ్యాక్యూమెంట్స్ ఉండే సచివాలయంలోనే కేబినెట్స్ మినిట్స్‌కు భద్రత లేకపోతే. ఇక ప్రజలకు సంబంధించిన కీలక పత్రాలు సచివాలయంలో ఉంటాయి.ఇప్పుడు వాటి భద్రతపై ప్రజల్లో అనుమామాలు వ్యక్తం అవుతుంది. .రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయంలో భద్రతాను ప్రభుత్వం గాలికి వదిలేసింది.ఏడాదిన్నరగా సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగులు హాల్ చల్ చేస్తున్నారు.నకిలీ ఐడీ కార్డ్‌లతో సచివాలయంలోకి చోరబడుతున్నారు.ఇటీవల కాలంలో అనేక సంఘనలు బయటపకు వచ్చి భద్రతా వైఫల్యాలు బయట పడ్డాయి..షేక్ ఐడీ కార్డ్‌తో సచివాలయంలో తిరిగారు.అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి వరకూ కాళేశ్వరంపై కేబినెట్‌లో చర్చ జరగలేదని, అసలు మినిట్స్‌లో లేదని ప్రచారం చేసింది.
అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సచివాలయంలో కీలక పదువుల్లో ఏపీకి చెందిన అధికారులను సీఎం రేవంత్ రెడ్డి తెచ్చి పెట్టుకున్నారు..మరీ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, నీటి పారుదల సలహదారుగా తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు దగ్గరి వ్యక్తిని నియమించడం, ఇప్పుడు కేబినెట్స్ మినిట్స్ మాయం అయ్యాయని ప్రభుత్వం ప్రకటించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా భారీ కుట్రలు జరిగాయని అర్థం అవుతుంది.
.అయితే తెలంగాణ కేబినెట్ మినిట్స్ పోయాయంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మినిట్స్ మాయం అంటే ప్రభుత్వమే నిర్లక్ష్యం కారణమేకాదు..తెలంగాణ ప్రజల భద్రతను ప్రమాదంలో పెట్టినట్లే అవుతుంది..వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.. సమాగ్ర విచారణ జరిపించాలి..ముఖ్యమంత్రిని, మంత్రులపై, సీఎస్, డీజీపీపై కేసు పెట్టాలి.ప్రజల భద్రత కంటే ముఖ్యమైన అంశం లేదు.అసవరం అయితే వారందరినీ అరెస్టు చేసి విచారించాలి.
.నివేదికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా..బీఆర్ఎస్ పార్టీ తప్పు ఏమీ లేదని ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే కాదు బీజేపీ కాంగ్రెస్ కుట్రలు కూడా బట్టబయలు అవుతుంది..అందుకే కమిషన్ గడువు నవంబర్ డిసెంబర్ వరకు పొడగించే కుట్రలో భాగంగానే మినిట్స్ మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు మొదలుపెట్టిందన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది.





