దౌర్జన్యాలు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విÖడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టి దొంగ హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారం నడిపిస్తున్నదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గుడ్డిలో మెల్లలాగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆరఎస్ కార్యకర్తలు ధైర్యంగా పోరాడి గెలుపొందారని కొనియాడారు. రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదని, ప్రజలు శాశ్వతం అని వఅశ్రీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి పురుషులకు చార్జీ డబుల్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు చూశారని, రాష్ట్రం సాధించడం ఒక అద్భుతమైన ఘట్టమని, తెలంగాణను అన్ని రంగాలలో అభివద్ధి చేయాలని అనేక ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. గతంలో నీరు, విద్యుత్ లేక రైతులు ఇబ్బందిపడ్డారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పుష్కలంగా విద్యుత్ అందించి రైతు భరోసాతో సహాయం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో భూముల ధరలు ఆకాశాన్నంటితే కాంగ్రెస్ హయాంలో పడిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని అన్నారు. సిద్దిపేటను హరీష్ రావు బాగా అభివృద్ధి చేశారని తలసాని ప్రశంసించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *