– అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు
– బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
– పలు ప్రచార సభల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: పురపాలక సంఘ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయనున్నదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోదాడ పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులలో సోమవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెనెపల్లి చందర్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ పాండురంగారావు, కాంగ్రెస్ సీనియర్ నేత లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, స్థానిక సంస్థలలో అధికార పార్టీకి అనువైన వాతావరణం ఏర్పడడం అరుదైన అంశమని అన్నారు. ప్రస్తుత పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ప్రజామోదం లభించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు ప్రజా క్షేత్రంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ, నిరుద్యోగ యువతీయువకులు సంతృప్తితో ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం

సూర్యాపేట/తిరుమలగిరి/నేరేడుచర్
————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




