– పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల
– మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు
– బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల వెనుకబాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి వోట్ల లెక్కింపు ప్రారంభించగా రాత్రి వరకు దాదాపుగా ముగిసింది. అయితే అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగింది. ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు 1450 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 700, బీజేపీ మద్దతుదారులు 126, ఇతరులు 397మంది ఇప్పటివరకు గెలుపొం దారు. ఇక కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రవ్యా ప్తంగా 37,500కు పైగా పోలింగ్ కేంద్రాల్లో భారీగా ఓటర్లు హాజరయ్యారు. మొదటి దశలో మొత్తం 3,834 సర్పంచ్ పదవులు, 27,600కు పైగా వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



