– నేషనల్ హెరాల్డ్ కేసులో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధింపులకు గురి చేయడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు ఇచ్చింది. ఈమేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లో గురువారం సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, యూత్, మహిళా మోర్చా నేతలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారంతో కరీంనగర్ పోలీసులు వారిని అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టులు కాంగ్రెస్ అగ్ర నేతల ప్రమేయం లేదని తీర్పు ఇచ్చిందని అయినప్పటికీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడి, సీబీఐ లను జేబు సంస్థలుగా వాడుకుంటూ రాజకీయంగా వారిని అణగదొక్కాలని ప్రతీకార చర్యలకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ శ్రేణులు బిజెపి నాయకులను ప్రజా క్షేత్రంలో తిరగనివ్వబోమని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
వరంగల్‌లో..
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా చేర్చినందుకు నిరసనగా గురువారం వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అయుబ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ముట్టడించిన పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులు వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ జకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




