పదేళ్లలో బీఆర్‌ఎస్ కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు
రాబోయే 10 ఏళ్ల డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912
108 మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ అంబులెన్స్ సేవలు
విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 18: కరెంటు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే కరెంటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో 1912 విద్యుత్ అంబులెన్స్ సేవలు, విద్యుత్ ఉద్యోగుల వైద్య శిబిరాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేసిందేనని చెప్పారు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని మొదటి దశ నుంచి 7వ దశ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టి పూర్తి చేశామన్నారు. పదేళ్లపాటు పాలించిన బీిఆర్‌ఎస్ నేతలు అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదని, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించినా పూర్తి చేయలేదని విమర్శించారు. బీిఆర్‌ఎస్ పాలనలో 2023 మార్చిలో 15వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చిందన్నారు. వాడకం పెరిగినా ఆ మేరకు సరఫరా చేసేందుకు శాఖ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2029-30 నాటికి 26,299 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని, 2034-35 నాటికి 33,773 మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందని, భవిష్యత్తు డిమాండ్‌కు రెట్టింపు విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటినుంచే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేస్తున్నదని ఉప ముఖ్య మంత్రి వివరించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాల సీ-2025 తీసుకొచ్చామన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఉత్పత్తి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందు కు పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన 29వేల పంపు సెట్లుకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ఇందుకుగాను ప్రభుత్వం రైతుల పక్షాన విద్యుత్ శాఖకు ప్రతి సంవత్సరం రూ.11,500 కోట్లు వెచ్చిస్తున్నదని ఆయన తెలిపారు. 200 యూనిట్ల వరకు అర్హులైన వారికి గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రంలో 50.71 లక్షలకు పైబడి పేదలు లబ్ధి పొందుతుండగా వారి పక్షాన ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు రూ.2,293 కోట్లు చెల్లింపు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 29,018 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇందుకుగాను ఆర్థిక శాఖ విద్యుత్ సంస్థలకు రూ.198కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలం దించేందుకు 108 మాదిరిగా విద్యుత్ శాఖలో 1912 సేవలను ప్రారంభిం చినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే వినియోగదారులు ఎక్కడినుంచైనా 1912కు కాల్ చేస్తే ఒక ఇంజనీరు, ఎలక్ట్రీషియన్, ట్రాన్స్ ఫార్మర్, నిచ్చెన, విద్యుత్ వైర్లతో కూడిన అంబులెన్స్ కొద్ది నిమిషాల్లో మీ ప్రాం తంలో ఉంటుందని డిప్యూటీ సీఎం తెలి పారు. ఈ అంబులెన్స్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఏ సమస్యలు ఉన్నా వినడానికి అధికారులు ఉన్నారు.. ఆపైన విద్యుత్ శాఖ మంత్రిగా తాను ఎప్పుడైనా సరే మాట్లా డేందుకు సమయం కేటా యిస్తానని తెలిపారు. సిబ్బంది విధుల నిర్వ హణలో భద్రతా చర్యలు తప్పకుం డా పాటించాలని భట్టి సూచించారు. విద్యుత్ సిబ్బందికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ.కోటి ప్రమాద బీమా చేసాం, దేశంలోనే ఏ ఒక్క రాష్ట్రం లోనూ ఈ తరహా పథకం అమలులో లేదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.


