కాంగ్రెస్‌ పెద్ద నాయకుడిని కోల్పోయింది

– దామోదర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ
– రాంరెడ్డికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు శుక్ర‌వారం నివాళులర్పించారు. హైదారాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ దామోదర్‌రెడ్డి బుధవారం రాత్రి మృతిచెందారు. శుక్రవారం ప్రజల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. దామోదర్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రైతు కమిషన్‌ చైౖర్మన్‌ కోదండ రెడ్డి తదితరులు ఉన్నారు. దామోదర్‌ రెడ్డి, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టామని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని కోదండరెడ్డి కొనియాడారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కోలుకుని తిరిగి పార్టీలో ఉంటారని తాము భావించామన్నారు. ఆయన మృతి ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా లింగాల గ్రామంలో జన్మించిన దామోదర్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సూర్యాపేట నుంచి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. దామోదర్‌రెడ్డిని ఆయన అభిమానులు ’టైగర్‌’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన అంత్యక్రియలు తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిరచాయి. దామోదర్‌ రెడ్డి పార్ధివదేహాన్ని కడసారి సందర్శించేందుకు సూర్యాపేటలోని ఆయన నివాసంలో ఏర్పాట్లు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *