మనుసింఘ్వి, వేం నరేందర్ నామినేషన్ దాఖలు

– రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన మంత్రి సీతక్క
– సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల హాజ‌రు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల నామినేషన్ కార్యక్రమంలో గురువారం పాల్గొని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అభినందనలు తెలిపారు. అభ్యర్థులకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *