– మూడుసార్లు బీఆర్‌ఎస్ ఉన్నా అభివృద్ధి సున్నా
– జూబ్లీహిల్స్‌కు నవీన్ యాదవ్ గెలుపు అవసరం
– స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మంత్రి సీతక్క
జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మూడుసార్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి జరగలేదని, అందుకే ఇక్కడ అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలుపు చాలా అవసరం ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండ సైట్-3లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్‌లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. అలాగే జ్యోతినగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి కావున పేదలకు ఉచితంగా బియ్యం, ఉచిత రవాణా, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ఇస్తున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4.5 లక్షల మందికి ఇండ్లను మంజూరు చేసిందంటూ నవీన్ గెలిస్తే పేదలకు ఇండ్లు వస్తాయన్నారు. పట్టణాలలో తక్కువ జాగా ఉన్నవాళ్లు ఇండ్లు కట్టుకునేందుకు రూల్స్‌ను మార్చామని, జి ప్లస్-1 విధానంలో ఇల్లు కట్టుకునేందుకు జీవో ఇచ్చామని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటూ ప్రతి మహిళను మహిళా సంఘంలో చేరుస్తున్నామని, మహిళలకు రూ.27 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చామని, మహిళా సంఘాలకు రుణంపై బీమా కల్పిస్తున్నామని, జ్యోతినగర్ మైనారిటీ పాఠశాల విద్యార్థులకు టాయిలెట్ నిర్మాణాల కోసం రూ.35 లక్షలు కేటాయించామని వివరించారు. గడిల బిడ్డ వద్దు.. గల్లీల బిడ్డ, గరీబోళ్ల బిడ్డ, పనిచేసే వ్యక్తి నవీన్ యాదవ్‌ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవీన్ పేరులోనే గెలుపు (విన్) ఉంది.. ఆయన విజయం సాధించడం ఖాయం అని చెప్పారు. రెండుసార్లు ఓటమిపాలైనా వెనుకడుగు వేయలేదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికి, జూబ్లీహిల్స్ ప్రజలకు మధ్య వారధిగా నవీన్ సేవలందిస్తాడన్నారు. బీఆర్‌ఎస్ మాయమాటలకు మోసపోక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఎంపీ మల్లు రవి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




