మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం :
– రూ.3.17 కోట్ల పనుల శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి

ఇల్లెందు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.3.17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శుక్ర‌వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇల్లెందు మున్సిపాలిటీకి మహర్దశ పడుతుందని, పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ప్రధానంగా పట్టణంలోని 1, 4, 7, 8, 9, 18, 22, 24 వార్డులలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇల్లెందును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పొంగులేటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుగు సాంబమూర్తి, మండల రాము, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *